Education

జేఎన్టీయూ నాచుపల్లి లో 10000 Coders క్యాంపస్ డ్రైవ్ – 10 మంది విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

10000 Coders క్యాంపస్ డ్రైవ్‌లో ఎంపికైన JNTUH UCEJ విద్యార్థులు

జగిత్యాల(బిఎస్కేన్యూస్) : జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, జగిత్యాల (JNTUH UCEJ) లో బి.టెక్ విద్యార్థుల కోసం 10000 Coders ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. నరసింహ గారు తెలిపారు.ఈ క్యాంపస్ డ్రైవ్‌లో భాగంగా ముందుగా 10000 Coders సంస్థకు చెందిన హెచ్.ఆర్ ప్రతినిధి శ్రీ పి. అరవింద్ గారు, ఫుల్ స్టాక్ డెవలపర్లు శ్రీ సాయి మహేంద్ర మరియు శ్రీ సాయి కన్నా గారు సంస్థ విధానాలు, శిక్షణ విధానం, ఉద్యోగ అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం రెండు దశల ఎంపిక ప్రక్రియను నిర్వహించారు.మొదటి దశలో నిర్వహించిన గ్రూప్ డిస్కషన్‌లో 41 మంది విద్యార్థులు అర్హత సాధించగా, రెండవ దశగా జరిగిన ముఖాముఖి ఇంటర్వ్యూలకు 41 మంది హాజరయ్యారు. ఈ ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపిన 10 మంది విద్యార్థులను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులకు ఎంపిక చేసినట్లు తెలిపారు.ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనం రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు (₹4–8 LPA) ఉంటుందని కళాశాల ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ అధికారి డా. బి. సతీష్ కుమార్ గారు వెల్లడించారు.రానున్న రోజుల్లో మరిన్ని ప్రముఖ సంస్థలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లను నిర్వహించనున్నామని, విద్యార్థులు వృత్తిపరంగా మరియు సాంకేతికంగా రాణించేలా కళాశాల యాజమాన్యం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. నరసింహ గారు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. కె. శ్రీనివాస్, ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ అధికారి డా. బి. సతీష్ కుమార్, శాఖల కోఆర్డినేటర్లు, ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ విభాగ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *