Uncategorizedఆధ్యాత్మికం

కొండగట్టు అంజన్న ఆశీస్సులతో ‘వల్లకాడు’ సినిమా ప్రారంభం

జగిత్యాల( కొండగట్టు): ప్రముఖ తెలంగాణ జానపద గాయకుడు, నటుడు జోగుల వెంకటేష్ నిర్మాతగా ‘అక్షర ప్రొడక్షన్స్’ పతాకంపై నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక నూతన చిత్రం వల్లకాడు శుభారంభం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం మంగళవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది.

అక్షర ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న తొలి చిత్రం కావడంతో, ఈ సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ స్వామివారి సన్నిధిలో విశేష పూజలు చేశారు. తమ మొదటి ప్రయత్నానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా అంజన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో దర్శకుడు అరికిల్ల విజయ్, నిర్మాత జోగుల వెంకటేష్‌తో పాటు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌ సభ్యులు జలంధర్, సతీష్, గణింధర్ తదితరులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.“మా బ్యానర్‌లో వస్తున్న తొలి సినిమా ‘వల్లకాడు’. ఈ ప్రయాణాన్ని కొండగట్టు అంజన్న ఆశీస్సులతో ప్రారంభించడం మాకు ఎంతో సంతోషం, ధైర్యం ఇస్తోంది,” అని నిర్మాత జోగుల వెంకటేష్ పేర్కొన్నారు.

👁️ 2 Views💬 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
×

Update Password