తెలంగాణ

జనసేన పార్టీ కరీంనగర్ నియోజకవర్గం కార్యాలయంలో గణపతి నవరాత్రి వేడుకలు

కరీంనగర్ జనసేన కార్యాలయంలో మట్టి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నాయకులు, వీర మహిళలు, జనసైనికులు

కరీంనగర్, సెప్టెంబర్ 14, BSK News: గణపతి నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని జనసేన పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కంటెస్టెడ్ కార్పొరేటర్ పొన్నాల తిరుపతి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కాసరాజుపటేల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీర్ల శ్రీనివాసరావు, మహాదేవుని రాజకుమార్, KP చారి, టేబుల్ ట్రస్ట్ వైస్ ఛైర్మన్ పొన్నాల సంపత్, జనసేన వీర మహిళా విభాగం జిల్లా నాయకురాలు రాగుల శిరీష, కుంట సుజాత, గుండ శకుంతల, జనసేన పార్టీ నాయకులు జంగ మహేష్, దొబ్బల అనిల్, ప్రశాంత్ తదితర జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు

👁️ 8 Views💬 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
×

Update Password