కొత్తపల్లి బస్టాండ్ వద్ద ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

కొత్తపల్లి 17, 18వ డివిజన్లలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి | ఆగస్టు 15, 2026 | బీఎస్‌కే న్యూస్ | రిపోర్టర్: బొద్దుల ప్రవీణ్ కుమార్
కొత్తపల్లి 17, 18వ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద ఉన్న పార్టీ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డీసీసీ స్పోక్స్‌పర్సన్ రాచకొండ ప్రభాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాచకొండ ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఢిల్లీలో విద్యార్థులపై ఇటీవల జరిగిన లాఠీచార్జి, భాష్పవాయువు ప్రయోగం వంటి ఘటనలను ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దేశ దురదృష్టకరమని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టడం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల మేరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వాటిని అమలు చేసేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నం సత్యనారాయణ గౌడ్, డీసీసీ జనరల్ సెక్రటరీ చిలుక హనుమంత రెడ్డి, డీసీసీ సెక్రటరీ గున్నాల రమేష్, 17వ డివిజన్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, 18వ డివిజన్ అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు దుబ్బాసి కుమార్, జిల్లా బీసీ సెల్ సెక్రటరీ యాస్వాడ రాజ్ కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షులు కుతాటి శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షులు వికార్ అహ్మద్ ఖాన్, పీసీ సెల్ అధ్యక్షులు సంఘం మునీందర్, బూస వీరు, తుమ్మ ప్రతాప్ రెడ్డి, బైరి మహేష్, రాపర్తి రాజు, పుల్ల రాజు, గోనే రవీందర్, బుస అశోక్, మందాల రాజి రెడ్డి, గుర్రం అభి తదితరులు పాల్గొన్నారు

Just checked out daulat777gamepk. Seems like a decent place to try my luck! Hope I can win some real money this time. Good luck to everyone else playing there! Check it out here: daulat777gamepk