కొత్తపల్లి గాంధీనగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కొత్తపల్లి గాంధీనగర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి |ఆగస్టు 15, 2026 | బీఎస్‌కే న్యూస్ | రిపోర్టర్: బొద్దుల ప్రవీణ్ కుమార్
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గాంధీనగర్‌లో బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బాపూజీ యూత్ క్లబ్ అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు.పొన్నం సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి, కాపాడుకోవాలని అన్నారు. ముఖ్యంగా యువత దేశ అభివృద్ధిలో ముందుండాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు గ్రామస్థాయిలోని అట్టడుగు వర్గాల ప్రజలకు చేరేలా యువత చొరవ తీసుకుని కృషి చేయాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, సామాజిక బాధ్యతతో యువత ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గున్నాల రమేష్, కన్నా అంజిబాబు, పొన్నం భూమయ్య, గుర్రం అనిల్, కేశ అరవింద్, పెద్ది వంశీ, నల్ల సంతోష్, శ్రీనివాస్, బుర్ర రాజు, గోనే రవీందర్, మునిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
