🎬 కరీంనగర్లో ‘ఋషి’ సినిమా ఆడిషన్స్
కరీంనగర్ | ఆగస్టు 24, 2026 | బీఎస్కే న్యూస్ | రిపోర్టర్: బొద్దుల ప్రవీణ్ కుమార్

కరీంనగర్లో సినీ సందడి నెలకొంది…
ADR ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై నూతనంగా నిర్మించబోతున్న ‘ఋషి’ సినిమా కోసం కరీంనగర్‌లోని ఫిలిం భవన్లో ఆడిషన్స్ నిర్వహించారు.
ఈ ఆడిషన్స్‌కు కరీంనగర్‌తో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు స్థానిక కళాకారులు ఉత్సాహంగా హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు.స్థానిక కళాకారులకు సినీ రంగంలో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో చిత్ర బృందం ఈ ఆడిషన్స్ నిర్వహించినట్లు తెలిపింది.
ఈ చిత్రం ద్వారా విల్సన్ రుద్రారపు నూతన హీరోగా తెలుగు తెరకు పరిచయం కానున్నారు.
ఈ సినిమాకు అనిల్ చొప్పరి దర్శకత్వం వహిస్తుండగా, ADR దామోదర్ దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నారు.కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు కూడా ఈ చిత్రంలో నటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.ఋషి’ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 20, 2026 నుంచి ప్రారంభం కానుంది. కరీంనగర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఈ ఆడిషన్స్ కార్యక్రమంలో ప్రవీణ్ బొద్దుల, పెన్సెంట్ గారు, ఏ. మల్లేష్ యాదవ్, నటుడు దత్తాత్రేయ తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కనున్న ‘ఋషి’ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
