పెగడపెల్లిలో పశువుల పాక దగ్ధం.. రూ.1 లక్ష ఆస్తి నష్టం

జగిత్యాల జిల్లా, పెగడపెల్లి, ఆగస్టు 23: జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం ఎల్లాపూర్ గ్రామంలో పశువుల పాకలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగు గంగాధర్ గౌడ్‌కు చెందిన పశువుల పాకలో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో పశువుల పాకతో పాటు అందులో ఉన్న బస్తాలు, ఇతర సామగ్రి దగ్ధమైనట్లు సమాచారం. ఘటనలో సుమారు రూ.1 లక్ష వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు
