BSK News ఎఫెక్ట్.. కొండగట్టులో శ్రీరాముడి ఆలయం తెరుచుకుంది


కొండగట్టు, ఆగస్టు 23: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ అంజన్న స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీరాముడి ఆలయం నెలల తరబడి మూసివేసి ఉండటంపై BSK News వరుస కథనాలను ప్రచురించింది. భక్తుల సమస్యను దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి BSK News వాట్సాప్ ద్వారా తీసుకెళ్లగా అధికారులు వెంటనే స్పందించారు.BSK News ద్వారా విషయం కమిషనర్ దృష్టికి వెళ్లిన ఒక్కరోజులోనే శ్రీరాముడి ఆలయాన్ని తెరిచి అర్చకుడిని ఏర్పాటు చేశారు. దీంతో భక్తులకు శ్రీరాముడి పాదుకల దర్శనం అందుబాటులోకి వచ్చింది. భక్తులు ఆలయంలోకి వెళ్లి శ్రీరాముడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.నెలల తరబడి ఆలయం మూసివేయడంతో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై BSK News ప్రచురించిన కథనాలకు అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.భక్తుల సమస్యను వెంటనే పరిష్కరించేందుకు స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్‌కు, సంబంధిత అధికారులు, ఆలయ సిబ్బందికి BSK News తరఫున, భక్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
