Devotional

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.1.79 కోట్లు

కొండగట్టు – బీఎస్‌కే న్యూస్:

జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 13 హుండీలను 84 రోజుల పాటు లెక్కించగా, రూ.1,79,35,866/- ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం

హుండీల లెక్కింపులో వచ్చిన మిశ్రమ వెండి, బంగారం వస్తువులను తిరిగి బ్యాగ్‌లలో వేసి సీల్ చేసి భద్రపరచారు. అలాగే 130 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు.

ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి టి. శ్రీకాంతా రావు, లలిత సేవా ట్రస్ట్ సభ్యులు, రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యులు, దేవాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకులు శ్రీ రాజమోగిలి, ఆలయ ఏఈఓ గుండి హరిహరనాత్, ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, ఆలయ సిబ్బంది, ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, హోంగార్డ్స్, బ్యాంక్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *