Jagtial District

కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు రూ.83 లక్షల ఆర్థిక సాయం


కొండగట్టులో అగ్ని ప్రమాద బాధితులకు రూ.83 లక్షల ఆర్థిక సాయం చెక్కులు అందజేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కొండగట్టు (బిఎస్కే) న్యూస్:జగిత్యాల జిల్లా కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుక్రవారం రూ.83 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ మేరకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్‌లను అప్రమత్తం చేసి సంఘటనా స్థలానికి పంపించి నివేదిక తెప్పించుకున్నామని తెలిపారు. తక్కువ సమయంలోనే బాధితులందరికీ పరిహారం అందించడం రాష్ట్ర చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ జరగలేదన్నారు. బాధితులు తిరిగి తమ జీవనోపాధి ప్రారంభించుకునే వరకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం పేదలకు అన్నం పెట్టే పథకం అని అన్నారు. రైతులు, పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు తక్షణమే నిధులు అందాయని తెలిపారు. బాధితులను పట్టించుకోకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు.కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదం జరిగిన అర్ధరాత్రి సమాచారం అందగానే ఎమ్మెల్యే సత్యం ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు భరోసా ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఇంత త్వరగా పరిహారం అందించిన ఉదాహరణలు లేవన్నారు.ముత్యంపేట సర్పంచ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే సత్యం, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట ఇచ్చి బాధితులకు నెరవేర్చారన్నారు. దుకాణదారులకు ఏడాది పాటు గ్రామ పంచాయతీ పన్ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తుల తరపున ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *