కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ

కొండగట్టు, ఆగస్టు 18: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ అంజన్న స్వామి ఆలయంలో శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఆలయంతో పాటు బేతాళ స్వామి ఆలయంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.భక్తులు క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎస్. అంజన్నరెడ్డి, అధికారులు హరిహరనాథ్, సునీల్, రాజేందర్‌రెడ్డి, అశోక్‌తో పాటు ఆలయ సిబ్బంది ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.
