కొండగట్టులో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

కొండగట్టు, ఆగస్టు 18: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట కొండగట్టు గీత కార్మిక సొసైటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప బహుజన యోధుడని, ప్రజల కోసం పోరాడిన ఆయన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం నాయకులు గుర్రం మల్లేశం గౌడ్, పంజాల మల్లేశం గౌడ్, పులి అంజనేయులు గౌడ్, పంజాల మధు గౌడ్, ఓల్లాల మనోజ్ గౌడ్‌తో పాటు గౌడ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
