కొండగట్టులో హనుమాన్, బేతాళ స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ

కొండగట్టు, ఆగస్టు 22: జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీ అంజన్న హనుమాన్ ఆలయంతో పాటు బేతాళ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.శనివారం కావడంతో ఉదయం నుంచే ఆలయాలకు భక్తుల రాక పెరిగింది. భక్తులు క్యూలైన్ల ద్వారా స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించాయి.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజన్నరెడ్డి సూచనల మేరకు అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులు హరిహరనాథ్, సునీల్, అశోక్, జెమిని, శ్రీనివాస్, ధర్మేందర్ తదితరులు భక్తులకు అవసరమైన సేవలను అందిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఆలయానికి వచ్చే భక్తులకు దర్శనం సజావుగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు
