ఆధ్యాత్మికం

కొండగట్టులో లడ్డూ ప్రసాదం కౌంటర్ వద్ద వివాదం.. సిబ్బందిపై చర్యలు కోరుతూ ధర్నా

కొండగట్టు ఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న భజరంగ్ దళ్ సభ్యులు

కొండగట్టు, ఆగస్టు 23: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ అంజన్న స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం కౌంటర్ వద్ద వివాదం చోటుచేసుకుంది. కౌంటర్ సిబ్బంది తమపై దురుసుగా ప్రవర్తించి, నెట్టివేశారని ఆరోపిస్తూ భజరంగ్ దళ్ జగిత్యాల సభ్యులు ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.లడ్డూ ప్రసాదం కొనుగోలు చేసేందుకు వెనుక వైపు నుంచి వెళ్లిన సమయంలో కౌంటర్‌లోని సిబ్బంది తమపైకి వచ్చి దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశారని సభ్యులు ఆరోపించారు. బాధ్యుడైన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈవో కార్యాలయం ఎదుట “ఈవో డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సమాచారం అందుకున్న ఏ ఎస్ఐ రమణ రెడ్డి, సూపరింటెండెంట్ సునీల్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదును స్వీకరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *