క్రైమ్

కోడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీ

కోడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ నిర్వహిస్తున్న ఎస్పీ అశోక్ కుమార్

కోడిమ్యాల, ఆగస్టు 24: వార్షిక తనిఖీల్లో భాగంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ సోమవారం కోడిమ్యాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ నిర్వహించారు. పోలీస్ శాఖలో సేవల నాణ్యతను మెరుగుపరచడం, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీసింగ్ అందించడం, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు నాణ్యత, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా సమీక్షించారు.స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసులు, పెండింగ్ కేసుల పురోగతి, దర్యాప్తు విధానం, నేరాల నియంత్రణ చర్యలు, స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి కేసును శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేసి, నాణ్యమైన దర్యాప్తుతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.పోలీస్ స్టేషన్‌లోని రిజిస్టర్లు, రికార్డులు, సిబ్బంది విధుల కేటాయింపు, కార్యాలయ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.5S విధానంలో పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ సిబ్బంది యూనిఫాంలో నీట్ టర్న్‌అవుట్‌తో ఉండాలని సూచించారు. క్రమశిక్షణ, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అనంతరం సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.నూతన సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.డయల్–112కు వచ్చే ప్రతి కాల్‌పై వెంటనే స్పందించి, సంఘటన స్థలానికి అత్యంత వేగంగా చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాత నేరస్తులపై నిరంతర నిఘా కొనసాగిస్తూ, వారిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసి నేరాల నివారణకు కృషి చేయాలని సూచించారు.విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణలో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.అదేవిధంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ చెల్లింపుల భద్రత, మోసగాళ్లు అనుసరిస్తున్న కొత్త పద్ధతులపై ప్రజలను చైతన్యపరిచి అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, సీఐ రాజ్ కుమార్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *