విద్య

ఇంజినీరింగ్‌లో ద్వితీయ స్థానం సాధించిన నాచుపల్లి విద్యార్థి

కళాశాల ప్రతినిధులు అందజేసిన ఇంజినీరింగ్ సర్టిఫికెట్

కొడిమ్యాల | BSK న్యూస్, ఆగస్టు 14: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి వినయ్ గౌడ్ ఇంజినీరింగ్‌లో ద్వితీయ స్థానం సాధించి పట్టా పొందారు.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం షేరిగూడలోని శ్రీ ఇందు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన వినయ్ గౌడ్ తన ప్రతిభతో ద్వితీయ స్థానంలో నిలిచారు.ఈ సందర్భంగా వినయ్ గౌడ్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు. ఇంజినీరింగ్‌లో ప్రతిభ కనబరిచి నాచుపల్లి గ్రామానికి మంచి పేరు తీసుకురావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *