జగిత్యాల జిల్లా

జగిత్యాలలో ఘనంగా బోనాల జాతర.. పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

hi

జగిత్యాల | BSK న్యూస్, ఆగస్టు 11: జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ సర్కిల్‌లో తెలంగాణ జగిత్యాల జిల్లా యూట్యూబర్స్, కళాకారుల ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బోనాల ఊరేగింపులో పాల్గొని భక్తులతో కలిసి సందడి చేశారు.ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ.. జగిత్యాలలో మొట్టమొదటిసారిగా యూట్యూబర్స్, కళాకారుల ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించడం అభినందనీయమన్నారు. బోనాలు తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలతో ముడిపడి ఉన్న పండుగ అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, జానపద కళలను భావితరాలకు అందించడంలో యూట్యూబర్స్, కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు దయ్యాల చంద్రకళ శంకర్, మానపూరి పవిత్ర మహేష్‌తో పాటు యూట్యూబర్స్, కళాకారులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *