కొండగట్టు అంజన్న ఆలయంలో సాధారణ రద్దీ

మల్యాల | BSK న్యూస్, ఆగస్టు 11: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ అంజన్న స్వామి ఆలయంలో మంగళవారం సాధారణ రద్దీ నెలకొంది. ఆషాఢ మాసం చివరి వారం కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని తమలపాకు, టెంకాయ మొక్కులు చెల్లించుకున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల దర్శనాలు, మొక్కుల కార్యక్రమాలను అధికారులు పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో ఈవో అంజన్న రెడ్డి, అధికారులు సునీల్, అర్చకులు చిరంజీవి స్వామి, లక్ష్మణ్ స్వామి, కపింధర్ స్వామి, అభిలాష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
