తాజా వార్తలు

పెద్దపల్లిలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం

మాట్లాడుతున్న ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి

పెద్దపల్లి | BSK న్యూస్, ఆగస్టు 13: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లాలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో దేశభక్తి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు జాతీయ పతాకాలను అందజేసి, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. జాతీయ జెండా దేశ గౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువత దేశసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *