కరీంనగర్లో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర

కరీంనగర్ | BSK న్యూస్, ఆగస్టు 13: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బీజేపీ నార్త్ జోన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల నుంచి ప్రారంభమైన యాత్ర కోర్టు అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది.యాత్ర అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్‌రావు, నార్త్ జోన్ అధ్యక్షుడు పాదం శివరాజ్, కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, భారీ జితేందర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు చిగురి రవి, నార్త్ జోన్ నాయకులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
