జగిత్యాల జిల్లా

జగిత్యాలలో ఘనంగా తిరంగా ర్యాలీ

జగిత్యాలలో తిరంగా ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు.

జగిత్యాల | BSK న్యూస్, ఆగస్టు 13: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని టౌన్ హాల్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది.జాతీయ జెండాలను చేతబూని నిర్వహించిన ర్యాలీలో దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుతూ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతమాతకు జై, వందేమాతరం నినాదాలతో జగిత్యాల పట్టణం మార్మోగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.ర్యాలీలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డా. బోగ శ్రావణి పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా, మండల పదాధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువత, దేశభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *