జగిత్యాల జిల్లా

కోరుట్లలో ఉచిత సహాయక ఉపకరణాల శిబిరం

కోరుట్లలో ఉచిత సహాయక ఉపకరణాల శిబిరంలో పాల్గొన్న వయోవృద్ధులు, దివ్యాంగులు

కోరుట్ల | BSK న్యూస్, ఆగస్టు 13: జగిత్యాల జిల్లా బీజేపీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ, అలీంఖో సంస్థ సహకారంతో కోరుట్ల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉచిత సహాయక ఉపకరణాల శిబిరాన్ని నిర్వహించారు.శిబిరంలో బ్యాటరీ ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు, ఇతర సహాయక పరికరాల కోసం అర్హులైన వారి నుంచి వివరాలు, దరఖాస్తులను స్వీకరించారు. వయోవృద్ధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అవసరాలు, సమస్యలను నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ద్వారా అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు కోరారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు మరింత ప్రయోజనం చేకూరేలా ఇలాంటి ఉచిత సహాయక ఉపకరణాల శిబిరాలను భవిష్యత్‌లో మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *