కొండగట్టులో JNTUH-UCEJ NSS ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమం

మల్యాల|BSK న్యూస్, ఆగస్టు 13: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ జగిత్యాల (UCEJ) NSS యూనిట్ ఆధ్వర్యంలో కొండగట్టులో సామాజిక పారిశుధ్యం, పర్యావరణ పరిశుభ్రత కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.NRI పరిశోధకురాలు, SAAF SUTRA సంస్థ అడ్వైజర్, దాతృత్వవేత్త డా. అనూజా రాయ్ (Ph.D.) సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కొండగట్టు శ్రీ అంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆధునిక ప్రజా మరుగుదొడ్ల సౌకర్యాల నిర్మాణానికి డా. అనూజా రాయ్ ఆర్థిక సహాయం అందించారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కొండగట్టు అంజనేయస్వామి దేవాలయ పరిసరాలు, రహదారులు, ఇతర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను సేకరించి తొలగించారు. పరిసరాలను శుభ్రపరచడంతో పాటు చెత్తను బాధ్యతాయుతంగా పారవేయడం, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.“పరిశుభ్రమైన పరిసరాలు–ఆరోగ్యకరమైన సమాజం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, సేవాభావాన్ని పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో JNTUH-UCEJ ప్రిన్సిపాల్ డా. జి. నరసింహ, వైస్ ప్రిన్సిపాల్ డా. కె. శ్రీనివాస్, NSS ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్. ప్రవీణ్‌కుమార్, డా. పి. సంగీత, బోధన, బోధనేతర సిబ్బందితో పాటు సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
