తాజా వార్తలు

కొత్తకొండ వీరభద్రస్వామి నక్షత్రమాల ప్రారంభం.. భక్తితో మాల ధరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పూజలు

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో నక్షత్ర మాల ధరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి | ఆగస్టు 15, 2026 | బీఎస్‌కే న్యూస్

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో 27 రోజుల పాటు కొనసాగనున్న నక్షత్రమాల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తితో నక్షత్రమాలను ధరించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అత్యంత చారిత్రాత్మకమైన, భక్తుల కొంగుబంగారమైన భద్రకాళీ సమేత కొత్తకొండ వీరభద్రస్వామి నక్షత్రమాల కార్యక్రమం ప్రారంభమైందన్నారు. 27 రోజుల పాటు కొనసాగనున్న ఈ నక్షత్రమాలను ఈ ప్రాంత ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారని తెలిపారు.గతంలో తాను కూడా నక్షత్రమాలను ధరించానని, ఈ ఏడాది కూడా నక్షత్రమాల ధరిస్తానని ఇచ్చిన మాట ప్రకారం స్వామివారి నక్షత్రమాలను భక్తితో ధరించానని మంత్రి పేర్కొన్నారు.ఈ 27 రోజుల పాటు స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సమృద్ధిగా జీవించాలని ఆకాంక్షించారు. రైతుల పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని, ఈ ప్రాంతమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.“సర్వేజనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి.. అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలి” అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *