Uncategorizedతాజా వార్తలు

కరీంనగర్‌లో సంగీత, ఆర్కెస్ట్రా కళాకారుల ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కరీంనగర్ | ఆగస్టు 15, 2026 | బీఎస్‌కే న్యూస్ | రిపోర్టర్: బొద్దుల ప్రవీణ్ కుమార్

కరీంనగర్‌లో సంగీత,ఆర్కెస్ట్రా కళాకారుల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కరీంనగర్ జిల్లా సంగీత మరియు ఆర్కెస్ట్రా కళాకారుల సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు గోగుల ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వీట్లు పంపిణీ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్కెస్ట్రా మరియు సంగీత కళాకారుల సంఘం అధ్యక్షులు గోగుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చిలువేరు శ్రీకాంత్, కోశాధికారి బాబు గౌరవేణి, కన్వీనర్ తిప్పబత్తిని రవి, కళాకారులు విఠల్ గొల్లపల్లి, రవీందర్, సిద్ది రమేష్, సల్వాజి ప్రవీణ్, ఆనంద్ మడుపు, శ్రీనివాస్, రాజు, అభినవ్, నరేష్, కలాం, గోపి, మధు, ప్రశాంత్, కరుణాకర్, బబ్లు ,సంధ్య, ప్రీతీ, రేణుక, పార్వతి, సంగీత, ఆర్కెస్ట్రా కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *