Uncategorized

నాగదేవతకు ప్రత్యేక పూజలు

కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి | ఆగస్టు 17, 2026 | బీఎస్‌కే న్యూస్ | రిపోర్టర్: బొద్దుల ప్రవీణ్ కుమార్

కోతపల్లి: శ్రావణ మాసం తొలి సోమవారం, నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని కోతపల్లి పట్టణంలోని చెరువు సమీపంలో కొలువై ఉన్న నాగదేవతకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగదేవతకు పాలు సమర్పించి, భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నాగదేవతను ప్రార్థించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *