ఆధ్యాత్మికం

కొండగట్టులో శ్రీరాముడి ఆలయం నెలలుగా మూసివేత.. భక్తుల అసంతృప్తి

కొండగట్టులో మూసివేసి ఉన్న శ్రీరాముడి ఆలయం

మల్యాల, ఆగస్టు 22: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ అంజన్న స్వామి ఆలయానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.అంజన్న స్వామి, బేతాళ స్వామిని దర్శించుకున్న అనంతరం శ్రీరాముడి ఆలయంలో ఉన్న శ్రీరాముడి పాదుకలను దర్శించుకోవడం కూడా భక్తుల ఆచారంగా కొనసాగుతోంది. అయితే శ్రీరాముడి ఆలయం నెలల తరబడి మూసివేసి ఉండటంతో భక్తులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఆలయం పక్కనే ఈవో కార్యాలయం ఉన్నప్పటికీ శ్రీరాముడి ఆలయం ఇంతకాలం మూసివేసి ఉండటంపై భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో అర్చకుడిని అందుబాటులో ఉంచి నిత్యపూజలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న శ్రీరాముడి ఆలయాన్ని నెలల తరబడి మూసివేసి ఉంచడం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆలయాన్ని తెరిచి శ్రీరాముడి పాదుకల దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *