జగిత్యాల నవదుర్గ సేవా సమితి ఆలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం

జగిత్యాల, ఆగస్టు 21: శ్రావణ శుక్రవారం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని నవదుర్గ సేవా సమితి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాతలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతంలో పాల్గొని అమ్మవారికి పూలు, కొబ్బరికాయలు సమర్పించారు. సేవా సమితి ఆధ్వర్యంలో పూజకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మహిళలు కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కోసం అమ్మవారిని ప్రార్థించారు.వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నవదుర్గ సేవా సమితి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ప్రత్యేక పూజలు, కుంకుమార్చన అనంతరం భక్తులు అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు
