మల్యాలలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

మల్యాల, ఆగస్టు 20: మల్యాల మండల కేంద్రంలోని సోనియాగాంధీ గుడి ఆవరణలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న దివంగత శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సాంకేతిక రంగంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజీవ్ గాంధీ కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు.రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శనిగరం తిరుపతి, మానాల, లంబాడిపల్లె, రాంపూర్, సర్వాపూర్, బల్వంతపూర్ సర్పంచులు బల్మూరి పాపారావు, మరాటి సంధ్యా సత్తయ్య, బద్దం సంధ్య, తిరుపతిరెడ్డి, జంగిలి హనుమంతు, కరుణ గణేష్, మల్యాల, పోతారం, నూకపల్లి ప్యాక్స్ చైర్మన్లు రామలింగారెడ్డి, కొల్లూరి గంగాధర్, నేరెళ్ల సతీష్ రెడ్డి, ఉపసర్పంచులు కందరి ముత్యం రెడ్డి, కటకం వినయ్, గొట్టే నరేష్, అరుణరావు, నర్సింహారెడ్డి, చెటేపల్లి నరేష్, బత్తిని మనోజ్ క్రాంతి, ముదం శ్రీనివాస్, బీవీ రమణ, మర్రి లక్ష్మణ్, కంటే అరుణ్, చంద్రయ్య, గుర్రం వెంకన్న గౌడ్, ఏడపల్లి మల్లయ్య, శంకర్ గౌడ్, నాగులపట సంజీవ్, కోలా రాజేశం గౌడ్, రామగిరి మురళి, పంజాల రమేష్ గౌడ్, అనిల్, శ్రీనివాస్ రెడ్డి, ఇతచెట్టు అంజయ్య, కొట్టేపల్లి బాబు తదితర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
