క్రైమ్

కోడిమ్యాలలో మార్కండేయ ఆలయంలో శివలింగం ధ్వంసం.. ఎస్సైకి పద్మశాలి సంఘం ఫిర్యాదు

ఎస్‌ఐకి ఫిర్యాదు చేస్తున్న పద్మశాలి సంఘ సభ్యులు

కోడిమ్యాల, ఆగస్టు 19: పద్మశాలి కుల సంఘానికి చెందిన స్థలంలో నిర్మించిన మార్కండేయ దేవాలయంలో ప్రతిష్ఠించిన శివలింగాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన కోడిమ్యాలలో కలకలం రేపింది.పద్మశాలి కుల సంఘానికి చెందిన స్థలంలో మార్కండేయ దేవాలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థానిక పద్మశాలి సంఘ సభ్యులు తెలిపారు. అయితే బుధవారం కొందరు వ్యక్తులు శివలింగాన్ని ఎత్తి ధ్వంసం చేసినట్లు ఆరోపించారు.ఈ ఘటనపై స్థానిక పద్మశాలి సంఘ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైకి ఫిర్యాదు చేశారు. శివలింగాన్ని ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు కోరారు. నిందితులపై చర్యలు తీసుకోని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఆలయానికి సంబంధించిన అంశంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పద్మశాలి సంఘ సభ్యులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *