తాజా వార్తలు

ఓబులాపూర్‌లో కుల సంఘ భవనాలకు శంకుస్థాపన.. పాఠశాల వంటగది ప్రారంభం

ఓబులాపూర్‌లో కుల సంఘ భవనాలకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

మల్యాల, ఆగస్టు 22: చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామంలో రజక, మాల కుల సంఘ భవనాల నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగది భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గ్రామాల్లో కుల సంఘాల భవనాల నిర్మాణంతో ఆయా సంఘాల సభ్యులకు సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సౌకర్యం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఓబులాపూర్ సర్పంచ్ గ్యాదాం కుమార్, ఉపసర్పంచ్ పొన్నం మల్లేశం గౌడ్, మాజీ సర్పంచులు బండి రవి గౌడ్, గుగ్గిళ్ల తిరుపతి, మొండయ్య, మాజీ ఎంపీటీసీ పందిరి రజిత శేఖర్, కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు శనిగరపు తిరుపతి, ప్యాక్స్ చైర్మన్లు నేరెళ్ల సతీష్ రెడ్డి, కొల్లూరి గంగాధర్, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.అలాగే ముత్యంపేట, నూకపల్లి, రాంపూర్, రాజారం, గుడిపేట, సర్వాపూర్ గ్రామాల సర్పంచులు, నాయకులు దారం ఆదిరెడ్డి, మిల్ట్రీ శ్రీనివాస్, సంధ్య తిరుపతి రెడ్డి, గుర్రం విజయ్, శ్వేత అంజిరెడ్డి, జంగిలి హనుమంతు, దొంగ ఆనందరెడ్డి, వెల్మ లక్ష్మారెడ్డి, కనకట్ల జలంధర్, మ్యాక లక్ష్మణ్, ముత్యాల నర్సింహారెడ్డి, ముదం శ్రీనివాస్, నల్ల తిరుపతి రెడ్డి, చెటుపల్లి నరేష్, నాగులపేట సంజీవ్, అనిల్, మర్రి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో మాల, రజక సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *