కొండగట్టు బేతాళ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

కొండగట్టు, ఆగస్టు 23: జగిత్యాల జిల్లా కొండగట్టులోని బేతాళ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు బేతాళ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.ఆదివారం సెలవు రోజు కావడంతో ఉదయం నుంచే ఆలయానికి భక్తుల రాక పెరిగింది. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో సందడిగా మారాయి
