కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

జగిత్యాల జిల్లా, కొండగట్టు | సెప్టెంబర్ 4:కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల గోపాల స్వామివారికి ఆలయ అర్చకులు పంచామృత అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.అనంతరం స్వామివారికి సహస్రనామ తులసి అర్చన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఉయ్యాల సేవ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ అంజనరెడ్డి, స్థానాచార్యులు కపిందర్, చిరంజీవి స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు
