కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో నూతన మొబైల్ టవర్ ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కొండగట్టు | సెప్టెంబర్ 4:జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఇండస్ టవర్స్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన మొబైల్ టవర్ను చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం శుక్రవారం ప్రారంభించారు.నూతన మొబైల్ టవర్ అందుబాటులోకి రావడంతో దేవస్థానానికి విచ్చేసే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు మెరుగైన మొబైల్ నెట్వర్క్, కమ్యూనికేషన్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డితో పాటు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు
