కొడిమ్యాలలో మేడిపల్లి సత్యం దూకుడు.. 1000 బైక్‌లతో భారీ ర్యాలీ

కొడిమ్యాల | సెప్టెంబర్ 4:కాంగ్రెస్ ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.అంగడి బజార్ నుంచి పూడూర్ చౌరస్తా వరకు సుమారు 1000 బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కొడిమ్యాల ప్రధాన రహదారులు సందడిగా మారాయి.ర్యాలీ అనంతరం పూడూర్ చౌరస్తా వద్ద నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మండల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంతో కొడిమ్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది
