కొండగట్టు అంజన్నను దర్శించుకున్న నటుడు ఉత్తేజ్

కొండగట్టు | సెప్టెంబర్ 11:ప్రముఖ నటుడు ఉత్తేజ్ తన కుమార్తె కుమారి పాటతో కలిసి జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఉత్తేజ్ మాట్లాడుతూ.. తన కుమార్తె పాట సినీ రంగంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంగా అంజన్న స్వామి ఆశీస్సులు పొందేందుకు కొండగట్టు వచ్చినట్లు తెలిపారు. తన కుమార్తెకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఉత్తేజ్, పాటను భక్తులు, అభిమానులు పలకరించారు. వారి వెంట జానపద గాయకుడు, నటుడు లల్లాయి మహేష్ గౌడ్, మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, గుడిపేట సర్పంచ్ ఇట్టిరెడ్డి అంజిరెడ్డి, ఆగంతపు వంశీధర్, నజీరుద్దీన్ తదితరులు ఉన్నారు
