ఆధ్యాత్మికం

గణేశ్ ఉత్సవాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష.. సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి

గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ | సెప్టెంబర్ 12:హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉత్సవాల పర్యవేక్షణ, సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, నగర ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు, హైడ్రా కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు ఉత్సవ నిర్వాహకులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.మండపాల వివరాలు పోలీసులకు అందించాలిగణేశ్ మండపాలకు అతిథులను ఆహ్వానించే సందర్భాల్లో ఆ వివరాలను నిర్వాహకులు స్థానిక పోలీస్ కమిషనరేట్‌కు అందించాలని సీఎం సూచించారు. మండపాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే సమాచారాన్ని ముందుగానే అందిస్తే ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణ సులభతరం అవుతుందని తెలిపారు.అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు తక్షణ చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులు అందించే సమాచారం ఉపయోగపడుతుందని చెప్పారు.గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. అయితే మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ సదుపాయాన్ని పొందాలని సూచించారు. రాష్ట్ర బడ్జెట్‌లో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక కేటాయింపు కూడా ఉంది.

నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మల కోసం ఏర్పాట్లు చేసిన తరహాలోనే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగేందుకు చెరువుల చుట్టూ క్రేన్లు ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.గణేశ్ ఉత్సవాల సందర్భంగా అధికారులు, మండప నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. గతంలోనూ ప్రభుత్వం గణేశ్ ఉత్సవాల కోసం అధికారులు, నిర్వాహకుల సమన్వయం, అనుమతులు పొందిన మండపాలకు ఉచిత విద్యుత్, నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది

👁️ 9 Views💬 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
×

Update Password