తాజా వార్తలు

సింగరేణిలో అక్రమ నిర్మాణాలపై విచారణ జరపాలి: మొలుమూరి శ్రీనివాస్

సింగరేణి అక్రమ నిర్మాణాలపై విచారణ జరపాలి: మొలుమూరి శ్రీనివాస్

పెద్దపల్లి జిల్లా : రామగుండం-3 ఏరియాలో ఏరియాలో అక్రమ నిర్మాణాలు, ఎస్టేట్ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై సింగరేణి సీఎండీ, డైరెక్టర్‌ (పా)కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అధికారుల పనితీరుపై పలు అనుమానాలు ఉన్నాయని, వాటిపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరారు.ప్రశ్నించిన వారికి నోటీసులు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగరేణిలో దొంగతనాలు, కార్మికులపై దాడుల ఆరోపణలు, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి సస్పెన్షన్ లేఖలు ఇచ్చిన అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా సంస్థ ప్రయోజనాలు, కార్మికుల హక్కులను కాపాడాలని పేర్కొన్నారు. అవసరమైన ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, విచారణ పురోగతిని ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు.

👁️ 12 Views💬 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
×

Update Password