ఆధ్యాత్మికం

అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్‌లో మంత్రుల శ్రీకృష్ణ దర్శనం

అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్‌లో శ్రీకృష్ణుడిని దర్శించుకున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి

హైదరాబాద్ | సెప్టెంబర్ 4:శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హైదరాబాద్ అత్తాపూర్‌లోని ఇస్కాన్ టెంపుల్‌లో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు లోకకళ్యాణం కోసం అవతరించి, ధర్మాన్ని స్థాపించి ప్రజలను సత్యం, న్యాయం, ధర్మం వైపు నడిపించారని పేర్కొన్నారు.శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భగవంతుని ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ప్రజా సేవను లక్ష్యంగా చేసుకుని వివిధ సంస్థలు, సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావడం అభినందనీయమని మంత్రి అన్నారు. ప్రజా సేవ కోసం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని, శ్రీకృష్ణ భగవానుని కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నారు

👁️ 8 Views💬 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
×

Update Password