ఆరోగ్యం

ఒడ్యాడ్‌లో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు

ఒడ్యాడ్‌లో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

భీమారం మండలం, ఒడ్యాడ్ | సెప్టెంబర్ 4: భీమారం మండలం ఒడ్యాడ్ గ్రామంలో వైద్య సిబ్బంది ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధుల నిర్ధారణ పరీక్షలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు చేపట్టారు.పరీక్షల అనంతరం అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.గ్రామ ప్రజలు అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్య సిబ్బంది కోరారు

👁️ 1 Views💬 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
×

Update Password