ఒడ్యాడ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు సర్పంచ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రి పంపిణీ

ఒడ్యాడ్, సెప్టెంబర్ 1: ఒడ్యాడ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు వర్క్‌బుక్స్, పెన్సిళ్లు, బొమ్మలను పంపిణీ చేశారు. చిన్నారుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు ఆటల ద్వారా విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ మాట్లాడుతూ.. చిన్నారుల విద్యాభివృద్ధికి అవసరమైన వర్క్‌బుక్స్, పెన్సిళ్లతో పాటు బొమ్మలను అందజేసినట్లు తెలిపారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాకేష్ కుమార్, ఉపాధ్యాయులు లింగమూర్తి, ప్రశాంత రేఖ, మురళి, మహేందర్, ధనలక్ష్మి, నాగరాణి, లాస్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
