కరీంనగర్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర


కరీంనగర్ | BSK న్యూస్, ఆగస్టు 12: కరీంనగర్ నగరంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహించారు. టవర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన యాత్ర రాజీవ్ చౌక్ మీదుగా గంజ్ హైస్కూల్ వరకు కొనసాగింది.జాతీయ జెండాలను చేతబూని నిర్వహించిన ఈ యాత్రలో దేశభక్తి నినాదాలు మార్మోగాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సందేశాన్ని ప్రజలకు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, సెంట్రల్ జోన్ అధ్యక్షుడు తణుకు సాయి కృష్ణ, కార్పొరేటర్లు వంగల పవన్, మాసం గణేష్, తాటి ప్రభావతి, గొట్టిముక్కుల ఉమారాణి వెంకటరమణ, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, దేవసాని సరస్వతి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, కో-ఆప్షన్ సభ్యులు కన్నె కృష్ణ, బల్బీర్ సింగ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
