కొండగట్టులో రెండు రోజులపాటు అంతరాలయ దర్శనాలు రద్దు
గర్భాలయ మరమ్మతు పనుల నేపథ్యంలో నిర్ణయం

కొండగట్టు, ఆగస్టు 19: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థాన గర్భాలయ మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో రెండు రోజులపాటు అంతరాలయ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి అంజన్న రెడ్డి తెలిపారు.గర్భాలయ మరమ్మతు పనుల కారణంగా ఆగస్టు 20, 21 తేదీల్లో అంతరాలయ దర్శనాలు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి ఆగస్టు 22వ తేదీ శనివారం నుంచి అంతరాలయ దర్శనాలు పునఃప్రారంభమవుతాయని తెలిపారు.భక్తులు ఈ విషయాన్ని గమనించి దేవస్థానానికి సహకరించాలన్నారు.
