ఆధ్యాత్మికం

కొండగట్టులో వాహన పూజ షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమిపూజ

రూ.50 లక్షలతో బహుళ ప్రయోజనాల షెడ్డు నిర్మాణం.. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి కొండగట్టుకు

కొండగట్టు | సెప్టెంబర్ 6: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ అంజన్న స్వామి దేవస్థాన ప్రాంగణంలో నూతన వాహన పూజ షెడ్డు నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. సుమారు రూ.50 లక్షల నిధులతో బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడేలా షెడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు.వాహన పూజల కోసం ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రదేశం సరిపోకపోవడంతో నూతన ప్రదేశాన్ని ఎంపిక చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఆలయ అభివృద్ధికి మరో 120 ఎకరాల భూమి అవసరం ఉందని దేవస్థాన ఈవో అంజన్న రెడ్డి తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేవస్థానానికి 22 ఎకరాల స్థలం మాత్రమే ఉందని, ఆలయ అభివృద్ధికి మరో 120 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ అవసరముందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ అంశంపై డీఎఫ్‌ఓతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు చెప్పారు.టీటీడీ నిధులతో నిర్మించాల్సిన 94 గదుల పనులు సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయాయని, ఈ విషయాన్ని అసెంబ్లీలో సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారని ఈవో పేర్కొన్నారు.నవంబర్‌లో చందనోత్సవంసుమారు 60–70 ఏళ్లుగా నిర్వహించని చందనోత్సవానికి అవసరమైన అనుమతులు పొందేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవ తీసుకున్నారని ఈవో తెలిపారు. నవంబర్ 15 నుంచి 20 వరకు కార్యక్రమాలు నిర్వహించి, నవంబర్ 20న చందనోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.అంజన్న భక్తుడిగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యేఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈవో అంజన్న రెడ్డి, ముత్యంపేట సర్పంచ్ ఆది రెడ్డి ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువస్తున్నారని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం వారు చేస్తున్న కృషిని అభినందించారు.కొండగట్టు అంజన్న స్వామిని భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగారంగా భావిస్తారని, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారని అన్నారు. రానున్న రోజుల్లో ఆలయ మాస్టర్‌ప్లాన్ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.టీటీడీ నిధులతో నిలిచిపోయిన అభివృద్ధి పనులను త్వరలోనే పరిష్కరించి ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా కాకుండా అంజన్న భక్తుడిగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, సహకార సంఘం అధ్యక్షులు గంగాధర్,సతీష్ రెడ్డి పాటు వివిధ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

👁️ 3 Views💬 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
×

Update Password