నమిలికొండ హనుమాన్ ఆలయానికి బోర్‌వెల్.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు

నమిలికొండ | సెప్టెంబర్ 5:నమిలికొండలోని శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఆలయ కమిటీ చేసిన అభ్యర్థన మేరకు నమిలికొండ హనుమాన్ ఆలయం వద్ద భక్తులు, ఆలయ అవసరాల కోసం నీటి సరఫరాకు బోర్‌వెల్ ఏర్పాటును తక్షణమే చేపట్టినందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. నీటి సమస్య పరిష్కారానికి స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కాసం లక్ష్మీరాజం, వైస్ చైర్మన్ మంద వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి, కమిటీ సభ్యులు అల్వాల నాగరాజు, గోనెపల్లి కృష్ణ, రామిడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు
