ఆధ్యాత్మికం

కొండగట్టు అంజన్న సన్నిధిలో శ్రావణ సప్తాహ ఉత్సవాలు

  • రెండో రోజు ఘనంగా విశేష పూజలు
కొండగట్టు అంజన్న సన్నిధిలో విశేష పూజలు.

మల్యాల | BSK న్యూస్, ఆగస్టు 14: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో శ్రావణ సప్తాహ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండో రోజు విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు, పుష్పసహస్రనామార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.శ్రావణ సప్తాహ ఉత్సవాలు ఆగస్టు 13 నుంచి 19వ తేదీ వరకు ఏడు రోజుల పాటు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ స్వామివారికి వివిధ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *