సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా
కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి | ఆగస్టు 18, 2026 | బీఎస్‌కే న్యూస్ | రిపోర్టర్: బొద్దుల ప్రవీణ్ కుమార్

కొత్తపల్లి, జూన్ 18: కొత్తపల్లి గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ పొన్నం సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం ఎదుట సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ బహుజన నాయకుడిగా ప్రజల కోసం పోరాడిన గొప్ప వీరుడని కొనియాడారు. గోల్కొండ నవాబులపై పోరాడుతూ అణగారిన వర్గాల ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి బహుజనుల హక్కుల కోసం పోరాడిన మహానాయకుడని అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీసీ, రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించడం పట్ల గౌడ సంఘం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తూ బహుజనుల ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తామని గౌడ సంఘం సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు కన్నా అంజిబాబు గౌడ్, బూస రామకృష్ణ గౌడ్, గున్నాల రమేష్ గౌడ్, పొన్నం భూమయ్య గౌడ్, కాటబోయిన పెద్ద లక్ష్మణ్ గౌడ్, కనకరాజు, గుర్రం శ్రీనివాస్ గౌడ్, పొన్నం శ్రీనివాస్, ముత్యం గణపతి, గున్నాల తిరుపతి, తీగల సత్యనారాయణ, గుర్రం అభిషేక్, బూస వీరేశం, గున్నాల మల్లేశం, బుర్ర శ్రీనివాస్, పొన్నం నరేష్, వాసన్ కుమార్, మహేష్, పార్టీ నాయకులు యస్వాడ రాజ్‌కుమార్, కుతటి శ్రీనివాస్, సంగం మునీందర్, పుల్ల రాజు, దూస రాజమౌళి, భోగ రాజేశం, బాపూజీ యూత్ క్లబ్ సభ్యులు పెద్ది వంశీ, కేశ అరవింద్, నల్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
