మల్యాలలో రైతు బాంధవుడు వైఎస్సార్‌కు ఘన నివాళి

మల్యాల, సెప్టెంబర్ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మల్యాల మండల కేంద్రంలోని సోనియా గాంధీ విగ్రహం ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104, ఇందిరమ్మ ఇళ్లు, జలయజ్ఞం వంటి పథకాలు ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకువచ్చాయని అన్నారు. పేదలు, రైతులు, విద్యార్థుల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన సేవలు ప్రజల గుండెల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క అనిల్, మండల కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు శనిగరపు తిరుపతి, సీనియర్ నాయకులు దొంగ ఆనందరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు నేరెళ్ల సతీష్ రెడ్డి, కొల్లూరి గంగాధర్, ఉపసర్పంచ్‌లు కాటుకం వినయ్, లక్ష్మణ్ చారి, బక్కిశెట్టి శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ ముదం శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ సాగర్, నాయకులు నర్సింహారెడ్డి, బండి రవి గౌడ్, బీవీ రమణ, దూస వెంకన్న, చంద్రయ్య, గుర్రం వెంకన్న, వీరబత్తిని తదితరులు పాల్గొన్నారు
