ఒడ్యాడ్‌లో ఘనంగా ఉట్టి పండగ

భీమారం మండలం, ఒడ్యాడ్ | సెప్టెంబర్ 4: భీమారం మండలం ఒడ్యాడ్ గ్రామంలో యాదవ సోదరుల ఆధ్వర్యంలో ఉట్టి పండగను ఘనంగా నిర్వహించారు. పండుగను వీక్షించేందుకు గ్రామస్థులు, యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొంది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పెద్దమనుషులు, గ్రామస్థుల సమక్షంలో ఉట్టి పండగను ప్రారంభించారు. యువత ఉత్సాహంగా పాల్గొనడంతో వేడుకలు సందడిగా సాగాయి.గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో సోదరభావం, ఐక్యతను పెంపొందించేలా నిలిచింది. కార్యక్రమానికి గ్రామస్థుల నుంచి మంచి స్పందన లభించింది.ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, యాదవ సోదరులు, యువత, మహిళలు, చిన్నారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
