జగిత్యాల జిల్లా

సర్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం

సర్వాపూర్‌లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తున్న కాంగ్రెస్ నాయకులు

మల్యాల మండలం, సర్వాపూర్ | సెప్టెంబర్ 4:చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు మల్యాల మండలం సర్వాపూర్ గ్రామంలో సయవేణి లత శ్రీశైలం దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా దంపతులకు సత్యమన్నా కానుకను అందజేశారు.ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంకు సయవేణి లత–శ్రీశైలం దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్క అనిల్, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శనిగరపు తిరుపతి, పాక్స్ చైర్మన్ నేరెళ్ల సతీష్ రెడ్డి, మ్యాక లక్ష్మణ్, ఇట్టిరెడ్డి అంజిరెడ్డి, బండి రవిగౌడ్, బివి రమణ, కిషన్ రెడ్డితో పాటు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

👁️ 4 Views💬 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
×

Update Password